రాజ్ కుంద్రా మరో షాక్‌…బెయిల్‌ తిరస్కరించిన కోర్టు

-

పోర్ట్ వీడియోల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే ఆయనను పోలీస్ కస్టడీనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు. రాజు కుంద్రాపై బలమైన సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అటు రోజు రోజుకు కేసులో ట్విస్ట్‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌ కుంద్రాకు మరో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది.

ఇవాళ్టితో రాజ్‌ కుంద్రా పోలీస్‌ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో బొంబాయి హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు రాజ్‌ కుంద్రా. అయితే… రాజ్‌ కుంద్రా బెయిల్ పిటిషన్ తిరస్కరించింది బొంబాయి హైకోర్టు. అంతేకాదు… రాజ్‌ కుంద్రాకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని పేర్కొంది కోర్టు. దీంతో ఇవాళ్టి నుంచి మరో 14 రోజుల పాటు పోలీస్‌ కస్టడీలోనే ఉండనున్నారు రాజ్‌ కుంద్రా. కాగా… జూలై 19 న అశ్లీల కంటెంట్ ఉత్పత్తి మరియు పంపిణీ ఆరోపణలపై కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version