టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ‘ఆచార్య’. ఈ పిక్చర్ లో ఫుల్ లెంగ్త్ కీ రోల్ ప్లే చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రీ తనయులిద్దరూ కలిసి నటించిన ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ ‘ఆచార్య’. ఈ సినిమాను ఈ నెల 29న చూసేందుకు అభిమానులు, సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
‘ఆచార్య’ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా, ఈ సినిమా మేకింగ్ లో RRR దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సాయం కూడా ఉంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ‘సిద్ధ’ అలియాస్ రామ్ చరణ్ తెలిపారు. రాజమౌళికి థాంక్స్ కూడా చెప్పారు. ఇంతకీ రాజమౌళి ‘ఆచార్య’ కోసం చేసిన సాయమేమిటంటే..రామ్ చరణ్ డేట్స్ ఇవ్వడమే.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించాలని చిరంజీవి భార్య సురేఖ బలమైన కోరిక. కాగా, ఇన్నాళ్లకు సరైన స్టోరి కొరటాల శివ చెప్పగా, ఇందులో ఎలాగైనా రామ్ చరణ్ నటించాలని అనుకున్నారు. అదే టైంలో RRR ఫిల్మ్ షూటింగ్ జరుగుతుండగా, చిరంజీవి రాజమౌళిని రిక్వెస్ట్ చేసి మరి .. రామ్ చరణ్ డేట్స్ తీసుకున్నారు.
అలా చిరంజీవి రిక్వెస్ట్ మేరకు కొన్ని రోజుల పాటు RRR నుంచి షూటింగ్ గ్యాప్ తీసుకుని వచ్చి ‘ఆచార్య’లో ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు రామ్ చరణ్. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది.