తెలంగాణా బీజేపీలో యాక్టివ్ గా ఉండే ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తున్నారు. రాజాసింగ్ హైదరాబాదులోని గోషా మహల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణా నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఆయనే కావడంతో ఫ్లోర్ లీడర్ కూడా ఆయనే. అయితే ఈయన కొద్దిరోజుల నుండి తమ రాష్ట్ర అధ్యక్ష్యుడి మీద మండిపడుతున్నారు. దానికి కారణం కొద్దిరోజుల క్రితం బీజేపీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలు. పార్టీ రాష్ట్ర కమిటీలో తాను చెప్పినవారికి ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదని ఆయన బండి సంజయ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ విషయం పక్కన పెడితే రాజా సింగ్ చేసే కామెంట్స్ హిందువులకి అనుకూలంగా ముస్లింలకి వ్యతిరేకంగా ఉంటాయి. ఎంఐఎం అన్నా, ఒవైసీలు అన్నా అంతెత్తున మండిపడతారు కూడా. అలాంటి ఆయన రామ జన్మభూమి అయిన అయోధ్యలో మసీద్ కూడా నిర్మించాలని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాక ఆ మసీద్ కు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలామ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తన జీవితాన్ని దారపోసి అబ్దుల్ కలాం భారత్ ను న్యూక్లియర్ శక్తిగా మార్చారాన్న రాజసింగ్ ఆయన పేరు పెట్టాలని అన్నారు. నిజానికి యోగి ఆదిత్యనాద్ అయోధ్యలో నిర్మించే మసీద్ కి బాబ్రీ అనే పేరు పెట్టమని పేర్కొన్నారు. ఈ విషయం మీద స్పందిస్తూ రాజా సింగ్ ఈ కామెంట్స్ చేశారు.