లోక్సభ ఎన్నికలవేళ బిజెపిలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం హాట్ టాపిక్ అయింది ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారని చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జహీరాబాద్ లో పోటీ చేస్తారని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరోవైపు పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని గతంలో రాజసింగ్ అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ మీద ఆసక్తి లేదని అన్నారు. తాజాగా అసెంబ్లీ ఆవరణలో రాజసింగ్ ఈ వ్యవహారం మీద స్పందించారు.
జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్తోందని అన్నారు. నాకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదు అని చెప్పారు. హిందూ రాజ్యం స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలనుకుంటున్నానని అన్నారు. బీసీసీఎం నినాదంతో ఎన్నికలకే వెళ్ళాం కనుక బిసి ఎమ్మెల్యేని ఫ్లోర్ లీడర్ గా నియమించాలని మా జాతీయ నాయకత్వం అనుకుంటుందని అన్నారు. బండి సంజయ్ కోసం కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారని అన్నారు.