బ్రేకింగ్‌ : దేవి శ్రీ ప్రసాద్ పై రాజా సింగ్ పోలీసు కేసు

-

పుష్ప సినిమా మ‌రింత వివాదాల్లోకి వెళుతుంది. ఈ సినిమాలో స‌మంత న‌టించిన ఐటెం సాంగ్ పెద్ద వివాదానికి తెర తీస్తుంది. ఇప్ప‌టికే ఈ పాట పై పురుషు సంఘం ఫిర్యాదు చేయ‌గా.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. దీనిపై రంగంలోకి దిగారు. సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని హైద‌రాబాద్ పోలీస్ కమిషనర్ కి పిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.

ఈ మేర‌కు హైదరాబాద్ పోలీసులు కమిషనర్ కు లేఖ రాశారు ఎమ్మెల్యే రాజాసింగ్. డివోషనల్ సాంగ్స్ ను ఐటమ్ సాంగ్ తరహాలో రాయడం పై రాజసింగ్ సింగ్ తీవ్ర‌ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని లేఖ లో పేర్కొన్నారు రాజాసింగ్. దేవి శ్రీ ప్రసాద్ వ్యహారాల శైలితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని… వెంటనే దేవిశ్రీప్రసాద్ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను కోరారు రాజాసింగ్..

Read more RELATED
Recommended to you

Exit mobile version