కవిత కామెంట్స్, సొంత పార్టీ బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు నిజమే అని అనుకుంటున్నానని పేర్కొన్నారు రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ లో కలిసిపోతారని బాంబు పేల్చారు.

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కడి నుంచి నిలబడాలి, ఎవరు పోటీ చేయాలి అనేది వాళ్లే డిసైడ్ చేస్తారన్నారు రాజాసింగ్. గతంలో ఇదే జరిగింది, దాని వల్లే బీజేపీ భారీగా నష్టపోయిందని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం మా పార్టీ నేతలే అంటూ ఆరోపణలు చేశారు. సస్పెన్షన్ భయంతోనే పార్టీ క్యాడర్, నేతలు నోరు మూసుకుని కూర్చొంటున్నారన్నారు రాజాసింగ్.