ఒకే వేదికపై సీఎం రేవంత్, అల్లు అర్జున్

-

ఒకే వేదికపై సీఎం రేవంత్, అల్లు అర్జున్ కనిపించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా గద్దర్ అవార్డులు ప్రకటిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.

CM Revanth and Allu Arjun on the same stage
CM Revanth and Allu Arjun on the same stage

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. కాగా జూన్‌ 14న హైటెక్స్‌లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ ఒకే వేదికను పంచుకోనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news