తెలంగాణలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

-

తెలంగాణలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం, తుఫ్రాన్ పేట్ లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు వార్డ్ మెంబర్ లు, 200 మంది కార్యకర్తలు. అనంతరం గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజగోపాల్ రెడ్డి.

పూజల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి అందిస్తున్న సేవలను చూసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.కెసిఆర్ బూటకపు మాటలపైన ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అందుకే డబల్ ఇంజన్ సర్కారు వైపు మొగ్గుచూపుతున్నారన్నారు.

 

ఈ ఎన్నికల తీర్పు.. చరిత్ర సృష్టించనున్నదని అన్నారు. మరో ఆరు నెలల్లో మునుగోడులో జరగనున్న ఎన్నికల్లో ఓడిపోతామని కెసిఆర్ గుబులు చెందుతున్నాడని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకోసం సిద్దమయ్యే అవకాశం ఉందన్నారు. నా పదవి త్యాగంతో ప్రజలు నా వైపు ఉన్నారని.. మునుగోడు ఉపఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version