టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎవరినైనా సరే టార్గెట్ చేసిందంటే ఇక వారి పుట్టపూర్వత్తరాలు బయటకు లాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని దగ్గుబాటి కుటుంబం వరకు ఎవరిని కూడా ఈమె వదలలేదు అని చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో ఉందనే విషయాన్ని కూడా బయటపెట్టింది శ్రీరెడ్డి మాత్రమే.. ఇక అంతేకాదు మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్నంగా బైటాయించి తనను నానితో పాటు మరి ఎంతోమంది స్టార్ సెలబ్రెటీల వారసులు వాడుకొని వదిలేశారు అంటూ సంచలన విషయాలు బయట పెట్టింది. అంతేకాదు వారితో తాను చాట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్ ను కూడా సోషల్ మీడియాలో బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
పెళ్లి కూతురైన శ్రీ రెడ్డి.. ఎంత ముద్దుగా వుందో..!!
-