మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పకుండా బిజెపిలోకి వస్తారని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తారని అన్నారు బండి సంజయ్. ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు.
తెలంగాణ ప్రజలు వరదలతో సతమతమవుతుంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీ వెళ్లాడని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా ని కలిసింది వాస్తవమేనని.. తప్పకుండా బిజెపిలో చేరబోతున్నారని స్పష్టం చేశారు. నల్గొండ నుంచి చాలామంది బిజెపిలో చేరబోతున్నారని తెలిపారు బండి సంజయ్. రానున్న రోజుల్లో బిజెపిలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు బండి సంజయ్.