మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కౌంట్ డౌన్ పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ మునుగోడు బహిరంగ సభకు వచ్చారు. అటు కాంగ్రెస్, బీజేపీ కూడా దూసుకుపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. మునుగోడు బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి టంగ్ స్లీప్ అయిన వీడియో వైరల్ అయింది. అమిత్ షా కుటుంబం లక్ష కోట్లు దోచుకుందట అంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి టంగ్ స్లీప్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోను టీఆర్‌ఎస్ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది.
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డికి తాజాగా ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.టీఆర్‌ఎస్ నేత సోము భరత్ కుమార్ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ..ఈ మేరకు రాజ్ గోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల 24 లక్షల రూపాయలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు వివరణ ఇవ్వాలంటూ రాజ్ గోపాల్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
అమిత్ షా కుటుంబం లక్ష కోట్లు దోచుకుందటా pic.twitter.com/gFhgf0CdYR
— krishanKTRS (@krishanKTRS) October 31, 2022