ఆ విషయంలో రాజమౌళి నే బీట్ చేసిన అనిల్ రావిపూడి..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి ఆస్కార్ సాధించి పెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి ఈ గొప్ప దర్శకుడిని మరొక యంగ్ డైరెక్టర్ తో పోల్చుతూ అభిమానులు చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో యంగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన అభిమానులు చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

తాజాగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి కంటే అనిల్ రావిపూడి వెయ్యిరెట్లు మంచి దర్శకుడు అని అతడు చాలా ధైర్యం కలిగిన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో వారు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే సినిమా పరిశ్రమలో నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి అని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం అనిల్ ని బాగా పొగిడేస్తున్నారు అనే చెప్పాలి. రాజమౌళి తన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాడు. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఒక టాలెంటెడ్ డైరెక్టర్ తన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తాడు అలాగే సమాజంలో ప్రజల మనస్తత్వం ఎలా ఉంది అనేది ఫన్నీగా చూపించగలడు.

రాజమౌళి తన సినీ కెరియర్ లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా చేయలేదు. ఇక ఈయన ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణతో ఒక్క సినిమాను కూడా తెరకెక్కించలేకపోయారు. కానీ బాలకృష్ణతో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా చేస్తున్నార. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది ఇక ఇప్పటికే త్రివిక్రమ్, హరీష్, రాంగోపాల్ వర్మ, శేఖర్ కమ్ముల వంటి వారు ఎవరు కూడా బాలకృష్ణతో సినిమా చేయడానికి ధైర్యం చేయలేదు. అలాంటిది ఒక అనిల్ రావిపూడికి మాత్రమే సాధ్యమైంది. అందుకే రాజమౌళి కంటే వెయ్యిరెట్లు అనిల్ రావిపూడి బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news