రాజశేఖర్ హెల్త్ కండిషన్ మీద జీవిత కీలక ప్రకటన

హీరో రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ మొత్తానికి క‌రోనా వైర‌స్ సోకిందన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఫ్యామిలీలో భార్య జీవిత సహా అందరూ కరోనా నుండి కోలుకున్నారు. అయితే రాజశేఖర్ మాత్రం ఇంకా అనారోగ్యంగా ఉండడంతో ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఒక రకంగా రాజ‌శేఖ‌ర్ హెల్త్ మాత్రం వారి కుటుంబ సభ్యులనే కాక అంద‌ర్నీ టెన్షన్ పెడుతోంది. అయితే తాజాగా ఆయనకు ప్లాస్మా థెర‌పీ చేసినట్టు కూడా హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది.

ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు రోజూ హాస్పిటల్ వాళ్ళు బులిటెన్ కూడా విడుద‌ల చేస్తున్నారు. అయినా టెన్షన్ అయితే క్లియర్ కాలేదు. తాజాగా ఈ అంశం మీద రాజ‌శేఖ‌ర్ భార్య జీవిత ఒక ప్రకటన్ చేశారు. ముందు కంటే కూడా గ‌త మూడు రోజులుగా ఆయ‌న ఆరోగ్యం బాగా మెరుగ‌య్యింద‌ని, 80శాతం వ‌ర‌కు ఇన్ఫెక్ష‌న్స్ తొలగిపోయాయని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఒక‌ట్రెండు రోజుల్లో ఐసీయూ నుండి డిశ్చార్జ్ అయి నార్మల్ వార్డ్ కు వచ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన హెల్త్ కోసం ప్రార్ధించిన అందరికీ ధన్యవాదాలు చెప్పింది.