ఆ సమయంలో బతుకుతానా లేదా అనిపించింది… రాజశేఖర్..!

-

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ పడి అనేక సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు నటుడు రాజశేఖర్ కు అనేకం ఉన్నాయి. అయితే రాజశేఖర్ ఆ తర్వాత కాలంలో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకోవడం లో కాస్త డీలా పడిపోయాడు. ఇలా వరుస పరాజయాలతో ఉన్న రాజశేఖర్ కు కొంత కాలం క్రితం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడ వేగ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం దక్కింది.

ఇలా మళ్లీ రాజశేఖర్ ‘గరుడ వేగ’ సినిమా తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. గరుడ వేగ లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత రాజశేఖర్ టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాల మధ్య థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ ‘శేఖర్’ అనే మూవీ లో నటిస్తున్నాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ కి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించగా, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే సన్నాహాలు చిత్ర బృందం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శుక్రవారం నిర్వహించిన ఆయన పుట్టిన రోజు వేడుకల్లో ఈ మూవీ నుంచి కిన్నెర’ అనే సాంగ్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. కొవిడ్‌ సోకినప్పుడు బతుకుతానా లేదా అని అనిపించింది. ఆ సమయంలో అభిమానుల ప్రార్థనలు ఫలించి ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయగలుగుతున్నాను అని వారే నా బలం అని రాజశేఖర్ చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news