నాకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి – రాజాసింగ్

-

బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని… నేను రాత పూర్వకంగా పిర్యాదు చేశానని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని ఆగ్రహించారు.

కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు ఉందని.. బీజేపీ , కాంగ్రెస్ నేతల పోన్ లు టాపింగ్ చేయడానికి, బీజేపీ తో brs నేతలు ఎవరు టచ్ లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఉందా అని నిలదీశారు. ఇప్పటి వరకు ఆక్షన్ తీసుకోలేదని నిప్పులు చెరిగారు. నన్ను చంపుతామని, స్లిపర్ సెల్స్ మీ చుట్టే ఉన్నారు అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. టెర్రరిస్ట్ లకు mim ఆశీర్వాదం ఉందని వారిని అరెస్ట్ చేస్తే ఉద్యోగాలు పోతాయని పోలీసులు భయపడుతున్నారా అని ప్రశ్నించారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version