జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని కాపీ కొట్టిన కాంగ్రెస్ సీఎం

-

రాష్ట్రంలో అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో త‌న మార్క్ చూపుతున్నారు. కీల‌క నిర్ణ‌యాల‌తో పాల‌న‌ను కొత్త‌పుంత‌లు తొక్కిస్తున్నారు. ప‌లు సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టి, వాటిని ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌గ‌న్ తన వంద రోజుల పాలనలో ఈ నిర్ణ‌యం ఓ మైలురాయిగా నిలుస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్య‌మంత్రి కాపీ కొట్టారు. తమ రాష్ట్రంలోనూ అమలు చేయడానికి ఆయ‌న రెడీ అవుతున్నారు.

అవును… రాజస్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాత్ ఆ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రణాళికులు రూపొందిస్తున్నారు. పెద్ద పరిశ్రమలకు ప్రభుత్వం ఆర్థికపరమైన ప్యాకేజీల రూపంలో లబ్ధి కలిగిస్తున్నందున ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తున్నారు. పబ్లిక్‌ ప్రయివేటు పార్టనర్‌షిప్‌ (పిపిపి), చిన్న తరహా పరిశ్రలు మొదలైన వాటిలో స్థానికులకు ఉద్యోగాలను కల్పించే విధంగా పథకాలను రూపొందిస్తున్నది.

ఇతర రాష్ట్రాలు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర యువత కోసం తామెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రసాది లాల్‌ మీనా అన్నారు. ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా, రాహుల్ గాంధీలకు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ అత్యంత స‌న్నిహితుడిగా ఉంటారు. మొన్నటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత అక్కడ సచిన్ పైలట్ సీఎం సీటు కోసం ప్రయత్నించారు.

అయిన‌ప్ప‌టికీ రాహుల్, సోనియాలు అశోక్ గెహ్లాత్‌కే పట్టం కట్టారు. అలాంటి గహ్లోత్ ఇప్పుడు రాహుల్, సోనియాలకు ఏమాత్రం నచ్చని జగన్ ఆలోచనను అమలు చేయడానికి రెడీ అయ్యారు. ఈ ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ అంటే గిట్ట‌ని, రాహుల్‌, సోనియాలు రాజ‌స్థాన్ సీఎం నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తారా లేదో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version