చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదంటే ?

-

33 రోజుల క్రితం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని సిఐడి పోలీసులు స్కిల్ స్కాం కేసులో అవినీతి జరిగినందుకు బాధ్యతగా భావిస్తూ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉంచడం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు, బంధువులు, సినీ నటులు, అందరూ స్పందించారు.. అరెస్ట్ చాలా అక్రమం అని ఏమి తప్పు చేశారని చంద్రబాబు ను అరెస్ట్ చేశారంటూ తమ గొంతుకను వినిపించారు. అయితే నందమూరి తారకరామారావు అంశలో పుట్టిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించలేదని ఇప్పటికీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ ఫ్రెండ్ అయిన రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉండడం వలనే ఈ అరెస్ట్ విషయంపై స్పందించలేదన్నారు. ఈ విషయం స్వయంగా ఎన్టీఆర్ రాజీవ్ తో పంచుకున్నారా లేదా తన అభిప్రాయాన్ని చెప్పారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version