రజినీకాంత్ 171 మూవీ టైటిల్ టీజర్ రిలీజ్

-

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తలైవా 171 గా ఈ సినిమా రాబోతుండ‌డంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవలే ఈ మూవీ నుంచి రజిని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఇదిలావుంటే ఈ సినిమా గూర్చి ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసారు. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఇక ఈ సినిమాకు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనుండగా.. శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నారు.ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక ఇంట‌ర్వ్యులో పాల్గోన్న లోకేష్ మాట్లాడుతూ.. తలైవా 171 నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్‌ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news