గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

-

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో కలిసి ఏడడుగులు వేశారు. గోవాలోని ITC గ్రాండ్లో ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు షాహిద్ కపూర్, శిల్పాశెట్టి, వరుణ్ ధావన్, భూమి పెడ్నేకర్ తదితరులు హాజరయ్యారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వరుడి సంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలో మరోసారి వివాహం జరగనుంది.

రకుల్ – జాకీ ప్రేమ మూడు సంవత్సరాల కిందట మొదలైంది. స్నేహితుల ద్వారా పరిచయమై తర్వాత వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. 2021 అక్టోబర్ 10వ తేదీన రకుల్ పుట్టిన రోజున తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా రకుల్, జాకీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ కలిసే చాలా ఫంక్షన్‍లకు వెళ్తూ జంటగా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news