గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ మరో భారీ ఫైట్..!

-

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో రామ్ చరణ్ చేయబోతున్న ఒక ఫైట్ గురించి ఇప్పుడు నెట్టింట్లా చర్చ జరుగుతోంది. సాధారణంగానే శంకర్ సినిమా అనగానే చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది. పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా రిచ్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు. గేమ్ చేంజర్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఒకే సమయంలో వెయ్యి మందితో ఫైట్ చేసేలా ఒక ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోతున్న షూటింగ్ షెడ్యూల్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారని వెయ్యి మంది లోకల్ ఇంటర్నేషనల్ ఫైటర్లతో రామ్ చరణ్ తేజ్ ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సీక్వెన్స్ మొత్తాన్ని హాలీవుడ్ కి చెందిన స్టంట్ కోఆర్డినేటర్లు కోఆర్డినేట్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news