Ram Charan: ఆ సినిమాకు దిమ్మ తిరిగే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన‌ రామ్ చ‌ర‌ణ్.. ఎంతో తెలుసా!

-

Ram Charan : సినిమా ట్రెండ్ మారింది. క‌థ‌, క‌థ‌నం, న‌టీన‌టులు విష‌యాలన్నింటిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. క‌థ న‌చ్చితే చాలు ఏ రేంజ్ లో అయినా.. సినిమా తీయ‌డానికి మూవీ మేక‌ర్స్ కూడా ఏ మాత్రం వెనుకడ‌టం లేదు. ఖ‌ర్చుకు ఎంతైనా స‌రే.. త‌గ్గేదేలే అన్న‌ట్టు సినిమాలు తీస్తున్నారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు నిర్మాత‌లు. ఈ త‌రుణంలో హీరోహీరోయిన్ల రెమ్మ్యూనరేషన్ విష‌యంలో కూడా ఏ మాత్రం వెనక్కి పోవ‌డం లేదు. వారి బ్రాండ్ ఇమేజ్ ను బ‌ట్టి .. ఎంతైనా చెల్లిస్తున్నారు.

ఈ క్రమంలోనే శంకర్- రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ భారీ మొత్తంలో రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మూవీ మేక‌ర్స్ కూడా డిమాండ్ కు ఓకే చెప్పిన‌ట్టు
దానికి ఓకే చెప్పి డేట్స్ తీసుకున్నారట మేకర్స్. రామ్ చ‌ర‌ణ్- శంకర్ క్రేజీ కాంబినేష‌న్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నటించేందుకు రామ్ చ‌ర‌ణ్ కు ఏకంగా 80 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట.

మెగా ప‌వ‌ర్ స్టార్ డిమాండ్ కు మేకర్స్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి 250 కోట్ల మేర బడ్జెట్ కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ న‌టిస్తుంది. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విష‌యాల‌తో షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ లో పవన్ కళ్యాన్‌, మ‌హేష్ బాబు దాదాపు 50 కోట్లవరకు వసూల్ చేస్తుండ‌గా..
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకొక్క సినిమాకు 100 కోట్ల వరకు వసూల్ చేస్తున్నాడని టాక్. ఇప్పుడు ప్రభాస్ తర్వాత.. ఆ స్థాయిలో పారితోషకం అందుకోనున్న స్టార్ గా రామ్ చ‌ర‌ణ్ నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version