RC 15 కోసం పూణే వెళ్లిన చరణ్..ఒక్కపాట కోసం అన్ని రోజుల షూటింగా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో ఆర్ సి 15 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా 15 రోజుల పాటు పుణేలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. పదిహేను రోజులపాటు ఒక పాట మాత్రమే చిత్రీకరణ చేస్తారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా పుణే లోనే ఒక ఫైట్ సీన్ కూడా ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. శంకర్ సినిమాలో పాటలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటల కోసమే శంకర్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని తెలిసిందే. దాంతో ఆర్ సి 15 లో సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందా అని అభిమానులు ఎక్సైట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పరిచయమవుతున్నారు.