Bigg Boss Telugu 5: ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. రోజురోజుకు మారుతున్న అంచనాలు.. ఆ కంటెస్టెంట్‌కు ముప్పు త‌ప్ప‌దా !

-

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా రసవత్తరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా.. బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకపోతున్న రియాలిటీ షో గా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు మరింత కాంట్రవర్షియల్ గా మారిపోయింది అని చెప్పాలి. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఒక రేంజ్ లో ఉంటున్నాయ్.

అలాగే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడోవారం ఎలిమినేష‌న్ ప్రాసెస్ రచ్చ రచ్చగా మారుతున్నది. నామినేట్ అయిన కంటెస్టెంట్ల ఓటింగ్ విషయంలో రోజురోజుకు మార్పు జ‌రుగుతుంది. ఓటింగ్ ఫలితాలు తారుమారు అవుతున్న‌యట‌. టాప్ కంటెస్టెంట్లు నామినేష‌న్ లో లేక‌పోవ‌డంతో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టు సమాచారం.

హౌస్‌లో ఇప్ప‌టి వ‌రకు ఆరు ఎలిమినేష‌న్లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతార‌నే ఉత్కంఠ పెరిగింది. ఈ వారం నామినేషన్‌ అయిన వారిలో అనీమాస్టర్, లోబో, ప్రియా డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది.
ఎన్నాడు లేని విధంగా .. ఏడో వారంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వ‌స్తున్నాయి. ఒకరి నొకరు దూషించుకోవడంతో ఓటింగ్ తీరు కూడా మారిపోయింది.

ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ లో వీజే సన్నీ, ప్రియ మధ్య గొడ‌వ‌తో హౌస్ మొత్తం హీటెక్కింది. అంద‌రి దృష్టి వీరిద్ద‌రిపైనే ప‌డింది. టాస్క్‌ల పరంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడి గట్టిగానే పోటీ ఇచ్చింది ప్రియ‌.
నిజానికి ఆ ఇష్యూతోనే ప్రియకి క్రేజ్ వచ్చింది. అది లేకపోతే ప్రియ ఈపాటికి ఎలిమినేషన్‌ లిస్ట్‌లో ఉండేది.
అలాగే.. వీజే సన్నీ, మానస్ ముందు నుంచి ఒక జట్టుగా ఆడుతున్నాయి.. వీరితో కాజ‌ల్ జ‌త కట్ట‌డంతో ఇంటిలో కొత్త గ్రూప్‌ ఏర్పడింది. హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చినా.. లోబో సన్నీకి చాలా క్లోజ్ ఉంటున్నారు. దీంతో ఓటింగ్ వారికి సానుకూలంగా మారింది. సన్నీ, మానస్ లు నామినేషన్‌లో లేకపోవడం వ‌ల్ల‌.. ఈ ఇద్ద‌రి ఓట్లు కాజల్, లోబోకు పడుతున్నట్టు సమాచారం.

గత రెండు వారాలుగా.. షణ్ముఖ్ జస్వంత్ ఓటింగ్ లో టాప్‌లోని నిలిచారు. అత్యధికంగా ఓట్లతో దూసుకపోతున్నాడు. అయితే గురువారం ఎపిసోడ్‌లో జెస్సీ సీక్రెట్ టాస్క్ దారుణంగా ఫ్లాప్ కావడం, సిరిపై ష‌ణ్ను ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో.. ఈ యూట్యూబ్ స్టార్ ఓట్లు ఎవ‌రికి పడుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక.. యాంకర్ రవి, ఆర్జే కాజల్ విష‌యానికి వ‌స్తే.. ఇద్ద‌రూ స‌మ‌వుజ్జీలే.. వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.. వారివారి సొంతం బలంపైనే నెగ్గుకొస్తున్నారు. ఇక కాజ‌ల్ కు సన్నీ, మానస్ కూడా తోడు కావడంతో ఆమె ఓటింగ్‌కు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. వీజే సన్నీ, మానస్ ఫ్యాన్స్ కూడా ఇత‌ర కంటెస్టెంట్ల‌కు భారీగా ఓట్లు చేస్తున్నట్టు సమాచారం.

ఇక మిగిలింది.. ప్రియ‌, అని మాస్ట‌ర్ లు. వీరిద్ద‌రూ కూడా డేంజ‌ర్ జోన్ లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఓటింగ్‌లో అట్ట‌డుగునా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇలా రోజురోజుకు ఈక్వేషన్స్ మార‌డంతో ఎలిమినేషన్ ప్ర‌క్రియ చాలా ఉత్కంఠ‌గా మారింది. ప‌రిస్థితులు ఇలానే కొన‌సాగితే.. ప్రియ గానీ, లేదా అని మాస్టర్‌లో ఎవరో ఒకరికి ముప్పు పొంచి ఉండే అవకాశం కనిపిస్తున్నది. లేదు.. వరుస‌గా లేడీ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అవుతారంటే.. జెస్సీకి ముప్పు త‌ప్పేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news