ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఇటీవల విడుదలై కాసుల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పూరి కసికి ఫలితం దక్కింది. సక్సెస్ ల్లేని పూరికి ఈసినిమా ఊపిరిపోసింది. రివ్యూలు అనుకూలంగా లేనప్పటికీ తుది తీర్పు మాత్రం ప్రేక్షకులదే కాబట్టి. అక్కడ నుంచి మంచి రివ్యూలే వచ్చాయి. అందుకే స్టిల్ థియేటర్లు ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్నాయి. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ ను పబ్ లో జరిపేసుకున్నారు. ఒకరిమీద ఒకరు ఆల్కాహాల్ స్ర్పే చేసుకుని మరి ఇస్మార్ట్ హిట్ కొట్టామని చూపించారు. త్వరలో సక్సెస్ టూర్ ను ప్లాన్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలను పూరి తన గ్యాంగ్ తో చుట్టేయాలని చూస్తున్నాడు.
ఆ విషయాలు పక్కనబెడితే సినిమాలో హీరో పాత్ర ఆద్శంగా లేదని, శంకర్ పాత్ర ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తుందని కొందరు చిత్ర బృందాన్ని సోషల్ మీడియా సాక్షిగా విమర్శిస్తున్నారు. అవి చూసిన హీరో రామ్ వాటిపై ఇస్మార్ట్ పంచ్ వేసాడు. హీరో హెల్మెట్ పెట్టుకోలేదు. హీరో సిగరెట్టు తాగుతున్నాడు. హీరో అమ్మాయికి గౌరవం ఇవ్వలేదు. ఎంతసేపు ఇవేకానీ…అక్కడ హీరో అడ్డం వచ్చిన వాళ్లను లేపేస్తున్నాడని ఒక్కరూ ఫిర్యాదు చేయరేం. జీవితానికి విలువ లేదు . చాలా బాధకారమని విమర్శించిన వాళ్లకి బధులిచ్చాడు. అది చూసిన దర్శకుడు పూరి బాగ్ చెప్పావ్ రామ్ అని ఎమోజీలు పెట్టాడు.
కాగా ఈసినిమా కథ తన సినిమా కతని పోలి ఉందని ఒకప్పటి హీరో ఆకాష్ ఫిలిం చాంబర్ లో నిన్నటి రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసాడు. తగిన న్యాయం జరగకపోతే చట్టపరంగా వెళ్తానని హెచ్చిరించాడు. కానీ వాటిని పూరి అండ్ టీమ్ పట్టించుకోలేదు. ఇదంతా ప్రచారం కోసమో…డబ్బు కోసమే చేస్తోన్న చిల్లర పనులని కొట్టిపారేస్తున్నట్లు సమాచారం. మీడియా కూడా ఆకాష్ ప్రచారం కోసమే ఇలా చేస్తున్నాడని కథనాలు రాయడం విశేషం. ప్రస్తుతం ఆకాష్ అవకాశాలు లేక కొన్నేళ్లగా ఖాళీగానే ఉంటున్నాడు.
Hero helmet pettukoledhu..
Hero smoke chestunnadu..
Hero ammailaki respect ivvatledhu..
Entha sepu ivve gaani.. Akkada hero addamochinavaalani champestunaadu..ani okkallu kuda complain cheyadam ledhu.. No value for life! SAD! #iSmartShankar – “A” Badass fictional character.— Ustaad iSmart Shankar (@ramsayz) July 23, 2019