వర్మ ‘క్యాస్ట్ ఫీలింగ్’ సాంగ్… వీడియోలో జగన్, పవన్, ప్రభాస్..!

-

నిత్యం ఏదొక వివాదంలో ఉంటూ వార్తల్లోకి ఎక్కే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…మరో వివాదాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. విజయవాడ రాజకీయాలని బేస్ చేసుకుని వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత వివాదాస్పదం కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటని విడుదల చేశాడు.

ram-gopal-varma-caste-feeling-song-released

అది కూడా క్యాస్ట్ ఫీలింగ్ మీద పాట. ఇక ఈ పాట “కమ్మలు… కాపులు… రెడ్లు… రాజులు… వైశ్యులు…” అంటూ మొదలవుతుంది. “నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం… నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు… ఈ ఫీలింగ్ లన్నీ కరెక్టయినపుడు, క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు? దేనికిరా… ఈ హిపోక్రసీ? ఎందుకురా… ఈ హిపోక్రసీ? అంటూ పాట సాగుతుంది.

దేశాన్ని కీర్తిస్తే దేశ భక్తి అయినప్పుడు, కులాన్ని కీర్తించే కుల భక్తి ఎందుకు తప్పని ప్రశ్నించారు. అయితే ఈ పాటకు ముందు క్యాస్ట్ ఫీలింగ్ పై వర్మ సెటైర్లు కూడా వేశారు. ఓ మీడియాలో కులం మీద వచ్చే స్లోగన్స్ ను ప్రస్తావించారు. ఇక సాంగ్ కి సంబంధించిన వీడియోలో వర్మ.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, సీఎం జగన్ , పవన్ కల్యాణ్, ప్రభాస్, ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎం రోశయ్య విజువల్స్ వాడారు.

ఇక వివాదాస్పదమైన ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతుంది. అయితే ఈ క్యాస్ట్ ఫీలింగ్ పాటపై మున్ముందు ఎలాంటి వివాదాలు చెలరేగుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version