రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాదాలకు.. వివాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. ఇక వర్మ ఏం చేసినా సంచలనమే. ప్రతి సారి ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయడం ఈయన నైజాం. ఈ సారి ఏకంగా భారత్ పర్యటకు వచ్చిన డోనాల్డ్ ట్రంప్‌పై పడ్డాడు వర్మ. మొన్నటికి మొన్న ట్రంప్ అహ్మదాబాద్ లో తనకు కోటి మంది స్వాగతం పలుకుతారని వ్యాఖలు చేసిన నేపధ్యంలో అమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, సన్నీ లియోన్ వంటి వారు కూడా ట్రంప్ తో కలిసి వస్తే అప్పుడు కోటి మంది వస్తారేమో అని సెటైర్ వేశారు. ఇక తాజాగా రెండ్రోజుల భారత పర్యటన పూర్తి చేసుకొని, అమెరికా చేరిన ట్రంప్‌ను ఉద్దేశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో సభ ముగిశాక ట్రంప్, మోదీ మధ్య సంభాషణ జరిగినట్లు.. ఆ సంభాషనల్లో ట్రంప్‌ను మోదీ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగినట్లు కామెంట్లను సృష్టించాడు ఆర్జీవీ. వర్మ తన ట్వీట్‌లో.. ‘ట్రంప్ : మోదీ.. నన్ను ఆహ్వానించేందుకు 70 లక్షల మంది వస్తారని చెప్పావ్. మరి లక్ష మందే వచ్చారేంటి.?.. దీనికి సమాధానంగా, మోదీ : 70 రూపాయలతో 1 డాలర్ ఎంత సమానమో.. 70 మంది అమెరికన్లతో ఒక గుజరాతీ సమానం’ అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ను రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ఆర్జీవీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కేక అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరికొందరు వర్మీపై ఫైర్ అవుతున్నారు.