టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కి మరో సారి నోటీసు ఇచ్చారు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్. ఇప్పటికే ఒకసారి నోటీస్ పంపిస్తే.. తాను హాజరు కాలేనని సీఐకి లేఖ ద్వారా సమాచారం అందించారు. మరోసారి ఈనెల 25న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కి హాజరుకావాలని నోటీసు పంపించారు. నిన్న రాంగోపాల్ వర్మ వాట్సప్ కి నోటీసు పంపించారు సీఐ శ్రీకాంత్. మొదటి సారి విచారణకి హాజరుకాకుండా వారం రోజులు గడువు కోరారు రాంగోపాల్ వర్మ.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు రాంగోపాల్ వర్మ. తాజాగా రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అభ్యంతకర పోస్టులు పెట్టారని టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదుతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.