ఏలూరులో రాం గోపాల్‌ వర్మ పర్యటన

టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ ఉన్న ఫలంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఇవాళ ప గో జిల్లా లోని ఏలూరు పట్టణం లో పర్యటించారు రాం గోపాల్‌ వర్మ. ఈ సందర్భంగా ఆసక్తి కర వ్యాక్యలు చేశారు వర్మ. తాను కొండా షూటింగ్ నిమిత్తం ఏలూరు వచ్చానని పేర్కొన్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో 15 రోజుల పాటు కొండా షూటింగ్ ఉంటుందని వెల్లడించారు.

మా అసోషియేషన్‌ ను తాను సర్కస్ తో పోల్చానని…దానికి కౌంటర్‌ గా నన్ను మనోజ్ రింగ్ మాస్టర్ అన్నాడని గుర్తు చేశారు వర్మ. రింగ్ మాస్టర్ గా వాళ్ళు ఆల్రెడి ఆ రోల్ ప్లే చేశారని..ప్రూవ్ కూడా చేశారని ఎద్దేవా చేశారు వర్మ. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పొలిటికల్స్ ను తాను ఇంకా వదలలేదని..త్వరలోనే మరో సినిమా తీస్తానని ప్రకటించారు. వరంగల్ లో కొండా సినిమా తీసే విషయం లో అక్కడ కొంత రాద్ధాంతం చేస్తున్నారని.. అందుకే ఏలూరు పరిసరాల్లో సినిమా తీస్తున్నానని స్పష్టం చేశారు వర్మ…