మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల అయ్యింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అప్లై చేసుకోవడానికి నవంబర్ 2 ఆఖరి తేదీ. కేవలం ఆన్ లైన్ పద్దతి లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్హత గురించి చూస్తే.. గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు వచ్చేసి ఏప్రిల్ 1, 2002 నుంచి సెప్టెంబర్ 30, 2025 మధ్యలో జన్మించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో 1500 మందిని రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు.
అన్ని రౌండ్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు12 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఇది ఇలా ఉంటే సైన్స్, మాథ్స్, జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు రాత పరీక్ష లో ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. రాత పరీక్ష రోజే ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ కూడా ఉంటుంది.
ఇక శాలరీ విషయానికి వస్తే.. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.14,600 వేతనం ఉంటుంది. ట్రైనింగ్ పూర్తి అయ్యాక రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు శాలరీ ఉంటుంది. పూర్తి వివరాలని https://www.joinindiannavy.gov.in/en లో చూడచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.