‘హిందూ సింహం’గా పేరొందిన ఈయన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఈయన వృత్తిరీత్యా ఇంజినీరు. రామజన్మభూమి ఉద్యమం ఉవ్వెత్తున ఎగియడానికి ఈయనే మూల కారణం. ఎందరో సాధువులను కలిశారు. సంత్లను కూడగట్టారు. 1984లో సాధువులతో కలిసి ‘తొలి ధర్మ సంసద్’ను నిర్వహించారు. దీని కారణంగానే ఆ రోజుల్లో రామజన్మభూమి ఉద్యమం భారత్తో ఊరూవాడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకా ఈయన చేపట్టిన అనేక కార్యక్రమాలు హిందువులను సంఘటితం చేశాయి. తరువాత కాలంలో వీహెచ్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు.
సంత్లు, సాధువుల మధ్య సంధానకర్తగా వ్యవహరించారు. రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేలా భారతీయ జనతా పార్టీని ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. తీర్పులు, ఇతరత్రా వివాదాలతో నిమిత్తం లేకుండా దశాబ్దాల క్రితమే అయోధ్య సమీపంలో ‘కరసేవక పురం’ పేరుతో రామాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంలో ఈయనే కీలకం. 2015లో సింఘాల్ పరమ పదించారు.