రామ్ సినిమా కి కష్టాలు.. అలా జరిగితే నేరుగా ఓటిటికే..!?

-

ఇస్మార్ట్ శంకర్ అనే బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఇక ఈ సినిమాలో రామ్ లుక్-డిఫ్రెంట్ ఉండడం ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలను పెం చేస్తుంది

అయితే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి ఈ సినిమా థియేటర్ వేదికగా విడుదల అవుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే సంక్రాంతి వరకు పూర్తిస్థాయిలో థియేటర్లో తెరుచుకునే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీంతో థియేటర్ల తీర్చుకోకపోతే రామ్ రెడ్ సినిమాను ఓ టి టి లో విడుదల చేయాల్సి వస్తుంది. దీంతో రామ్ రెడ్ సినిమా చిత్ర బృందం ప్రస్తుతం అయోమయంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version