రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే ?

-

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న రెడ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమాతో థియేటర్లలోకి రానున్నానని గతంలోనే ప్రకటించిన యూనిట్ ఈరోజు డేట్ కూడా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ లు హీరోయిన్లుగా నటించారు.

సక్సెస్ ఫుల్ దర్శకుడు తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవి కిశోర్ నిర్మించారు. ఇక ఈ సినిమా ఈ రోజే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీం U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన మణిశర్మ, ‘రెడ్’కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన  థియేట్రికల్ ట్రయిలర్ కి అద్భుతమైన   స్పందన లభిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news