RAVITEJA : ”రామారావు ఆన్ డ్యూటీ” రిలీజ్ డేట్ ఫిక్స్‌

-

మాస్ మహారాజా రవితేజ కరోనా తర్వాత… ట్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. క్రాక్ సినిమాతో సాలిడ్ సక్సెస్ సాధించి గట్టి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. క్రాక్ ఇచ్చిన ఊపుతో ఒకేసారి వరుస గా 5 ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే రవితేజ 67 సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

ఇక 68వ సినిమా త్రినాథ్ రావు దర్శకత్వంలో ధమాకా కూడా షూటింగ్ దశలో ఉంది. రవితేజ 69వ సినిమా శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. మార్చి 25 వ తేదీన థియేట‌ర్ల‌లో రామారావు సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్ తో ర‌వితేజ ఫ్యాన్స్ లో కోలాహాలం నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version