Promotions: సినిమా తీస్తే సరిపోదు.. సినిమాను ప్రజల్లోకి తీసుకొని వెళ్తేనే సినిమాను హిట్ అవుతుందని సినీ పెద్దలు సినిమాలకు ఓ రేంజులో ప్రమోషన్స్ చేస్తుంటారు.. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్ లో ఒకప్పటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది.. జనాల్లోకి నేరుగా వెళ్లాలని కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారు.. అందుకు కారణం కూడా ఉంది..గోపీచంద్ హీరోగా డింపుల్ హయతి హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రామబాణం ప్రమోషన్స్ ను వెరైటీగా ప్లాన్ చేశారు.. అందుకు సంబందించిన ఫొటోలో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి..
వేసవి కానుకగా మే 5న విడుదల కానున్న ఈ మూవీ యొక్క ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తోంది యూనిట్. ఓవైపు పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇవ్వడంతో పాటు ఇతర టివి ఛానల్స్ లో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రామబాణం యూనిట్ సందడి చేస్తూ తమ సినిమాని మరింతగా ప్రమోట్ చేస్తోంది. అలాగే పాల పాకెట్లు మీద తమ సినిమా పోస్టర్ ని వేయటం ద్వారా కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ని నిర్వహిస్తోంది.. అంతేకాదు ఆరోగ్యాకరమైన ఆహారాన్ని తీసుకోవాలి అంటూ మెసేజ్ లు కూడా ఇస్తుంది.. నిల్వ ఉంచిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. తరచుగా ప్యాక్ చేసిన ప్యాకెట్లలో వచ్చే ఫాస్ట్ ఫుడ్‌తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. టెర్రకోట, సాంప్రదాయ గ్రైండర్లతో గ్రైండింగ్ లాంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని తయారు చేయవచ్చు..
ఈ రోజుల్లో ప్రజలు ఫాస్ట్ ఫుడ్‌ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడమే రామబాణం ప్రధాన నినాదం అని టీమ్ చెప్తోంది..మరి ఈ ప్రమోషన్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో,మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే… పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ గా నిర్మించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో జగపతి బాబు, కుష్బూ నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన రామబాణం మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ తరవాత అంచనాలు మరింతగా పెంచేసింది… ఈ సినిమా తో అయినా గోపీచంద్ ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి..