ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పార్టీ పుట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జున యూనివర్సిటీ దగ్గర భారీగా బహిరంగ సభను ఏర్పాటు చేసి భారత్ చైతన్య యువజన పార్టీని స్థాపించాడు. ఈ సభకు ప్రజలు బాగానే వచ్చినా … పార్టీకి ఆదరణ దక్కడ కష్టమే అని చెప్పాలి. ఈ పార్టీని స్థాపించిన రామచంద్ర యాదవ్ ప్రజలకు ఉపయోగపడే పాలనను తీసుకురావడమే మా పార్టీ ఉద్దేశ్యం అంటూ చెప్పుకొచ్చారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈయన పుంగనూరు ఎమ్మెల్యే మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారట. ఈ కంప్లైంట్ లో రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ. 35 వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని పేర్కొన్నారు. కాగా ఈయన అక్రమంగా సంపాదించిన అన్ని ఆస్తుల పైన ఈడీ చేత దర్యాప్తు చేయించాలని రిక్వెస్ట్ చేశారు.
ఇంకా ఈయన ఇచ్చిన కంప్లైంట్ లో ఈసీని దారుణంగా పక్కదారి పట్టించారని రామచంద్ర యాదవ్ తెలిపారు. ఇతని పేరున ఉన్న PLR కంపెనీ 2019 – 2023 లలో ఆదాయం వందల రేట్లు పెరిగిందని తెలుస్తోంది.