216 అడుగుల ఎత్తైన ‘సమత మూర్తి’ విగ్రహాన్ని మోదీ ప్రారంభించారు. శ్రీ రామానుజచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ కు వచ్చిన మోదీ ఇక్రిశాట్ కార్యక్రమం ముగియగానే ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ కోసం వచ్చారు. వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అక్కడే హోమంలో పాల్గొన్నారు. పూర్తిగా సంప్రదాయ బద్దంగా మోదీ కార్యక్రమానికి హాజరయ్యారు.
ముందుగా వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్న తరువాత.. అక్కడ నుంచి సమతా మూర్తి విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహం ప్రత్యేకతలను చిన్నజీయర్ స్వామి ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామేశ్వర్ రావు పాల్గొన్నారు.