బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఉమ్మడి ప్రభుత్వం మహావికాస్ అఘాడీపై విరమర్శలు చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ట్రాఫిక్ జామ్ లతో 3శాతం విడాకులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ‘‘నేను సాధారణ పౌరురాలిగా చెబుతున్నాను.. ఒక్కసారి బయటకి వెళ్లే గుంతలు, ట్రాఫిక్ సహా అనే సమస్యలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ కారణంగా ప్రజలు తమ కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నారు. దీని వల్ల ముంబైలో మూడు శాతం విడాకులకు కారణం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని’’ అమృత ఫడ్నవీస్ సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వసూలీ ప్రభుత్వంగా మారిందని ఆమె విమర్శించారు.
అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ .. . “రోడ్లపై ట్రాఫిక్ కారణంగా 3% ముంబైకర్లు విడాకులు తీసుకుంటున్నారని క్లెయిమ్ చేసిన మహిళకు బెస్ట్ (ఐఎల్) లాజిక్ ఆఫ్ ది డే అవార్డు ఇవ్వబడుతుంది అంటూ ఎద్దేవా చేశారు. ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ట్రాఫిక్ విడాకులకు దారి తీస్తుందని ఆమె ఆరోపించడం విస్మయానికి గురిచేసిందని అన్నారు.