రామాయణం ప్రపంచ రికార్డ్…!

-

దూరదర్శన్‌లో తిరిగి ప్రసారం అవుతున్న రామనంద్ సాగర్స్ వారి ప్రముఖ టీవీ సీరియల్ ‘రామాయణం’ ఏప్రిల్ 16 న 7.7 కోట్ల మంది వీక్షించారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన షో గా నిలిచింది. డిడి ఇండియా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో గురువారం అర్థరాత్రి పోస్ట్ చేసింది. ప్రజల డిమాండ్ మేరకు మార్చి 28 నుంచి మళ్లీ ‘రామాయణం’ ప్రసారం అవుతోంది. వాస్తవానికి, ఇది మొదటిసారి ప్రసారం అయినప్పుడు,

ఈ సీరియల్ కి ఈ స్థాయిలో ప్రజాదరణ లేదు. ఇప్పుడు ఇది చాలా రికార్డులను బద్దలు కొట్టింది. రామనంద్ సాగర్ ఈ సీరియల్ మొత్తం 78 ఎపిసోడ్లను వాల్మీకి యొక్క రామాయణం మరియు తులసీదాస్ రామ్‌ చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. దేశంలో మొట్టమొదటిసారిగా, ఈ సీరియల్ జనవరి 25, 1987 నుండి జూలై 31, 1988 వరకు ప్రసారం చేసారు. అప్పుడు, ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం టివిలో ప్రసారం చేసే వారు.

1987 నుండి 1988 వరకు ‘రామాయణం’ ప్రపంచంలో అత్యధికంగా మంది వీక్షించిన సీరియల్‌గా నిలిచింది. జూన్ 2003 వరకు, ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో “ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన పౌరాణిక సీరియల్” గా రికార్డ్ సృష్టించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సీరియల్ మొదటిసారి దేశంలో ప్రసారం ప్రారంభించినప్పుడు, ప్రజలు టీవీ సెట్‌లకు అతుక్కుపోయే వారు. అప్పట్లో ఇళ్లలో టీవీలు తక్కువగా ఉండటంతో చాలా మంది ఈ సీరియల్ చూడటానికి పక్కింటికి వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news