బాధ్యత గల ప్రజాప్రతినిధి ఇప్పుడు ఏం చేయాలి గల్లా?

-

లాక్ డౌన్ వేళ ఇళ్లల్లో దాక్కొన్న ప్రతీ నాయకుడూ ఈ అవకాశాలను తమకు నచ్చినట్లు మార్చేసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయంలో బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అందుబాటులో ఉండి, ధైర్యం చెబుతూ, నిత్యావసర వస్తువులు పంపిణీచేస్తూ.. ఇలాంటి కష్టకాలంలో కూడా మా నాయకుడు మాకు ఏమి చేసినా చేయకపోయినా అందుబాటులో అయితే ఉన్నాడు.. అదే మాకు పదివేలు అని జనాలతో అనిపించుకోవాలి. ఎందుకంటే… పెద్దదిక్కు అయిన మనిషి ఏమి చేసినా చేయకపోయినా… అందుబాటులో ఉంటే చాలు.. అదే పెద్ద దైర్యం! ఈ విషయాలు మరిచిన నాయకులు కొందరు “మేము సేఫ్” అంటూ ఉంటున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… అమర్ రాజా సంస్థ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇవ్వడంతో తన బాధ్యత తీరిపోయింది అనుకున్నారో ఏమో కానీ… గల్లా జయదేవ్ తాజా మాటలు అలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇవ్వడంతో అమర్ రాజా సంస్థ యజమానికి పేరు వచ్చి ఉండొచ్చుకానీ… గుంటూరు ఎంపీ కి పేరు రావడం, ప్రజల మన్ననలు పొందడం అనేది మాత్రం… జనాల్లో ఉంటేనే, జనాలకు అందుబాటులో ఉంటేనే సాధ్యం అనే విషయం మరిచినట్లున్నారు గల్లా జయదేవ్! తాజాగా జూం యాప్ ద్వారా ప్రెస్ మీట్ పెట్టిన గల్లా జయదేవ్… లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటినుంచీ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉంటున్నానని… కాని వైకాపా నేతలు మాత్రం ఇష్టానుసారంగా తిరుగుతున్నారని చెప్పుకొస్తున్నారు! ఇలానే వైకాపా నేతలు కూడా తాము బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులము అని ఇళ్లల్లో కూర్చుని ఉంటే… రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏమిటి? అధికార పార్టీలో ఉంటేనే బాధ్యత ఉండాలా? అంటే… గుంటూరు ఎంపీ స్థానానికి ఓట్లేసిన జనాల ఓట్లన్నీ బూడిదలో పోసిన పనీరేనా? ఏమో… గల్లా కే తెలియాలి!

గల్లా జయదేవ్ మాటలు ఎంత బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయో అంటూ వినిపిస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కన పెడితే… ఈ సమయంలో బాధ్యత గల పౌరులు ఇంట్లో ఉండి, స్వీయ నిర్భందంలో ఉండాలి… బాధ్యత గల ప్రజాప్రతినిధులు తమను ఎన్నుకున్న ప్రజలకు భౌతిక దూరం పాటిస్తూనే ఎంతో కొంత సాయపడుతూ.. మీకు నేనున్నా అని ధైర్యం కలిగించాలి. అంతేకాని… బాధ్యత గల ప్రజాప్రతినిధిని కాబట్టి ఇంట్లో ముసుగేసుకుని కూర్చున్నాను అంటే ప్రజాస్వామ్యంలో సరైన ఆలోచనేనా? పైగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జనాలను గాలికి వదిలేయకుండా నిత్యావసరసరుకుల పంపిణీ అనో, కాయగూరల పంపిణీ అనో ఆదుకుంటున్న వైకాపా నాయకులపై సెటైర్లు కూడానా?

బిజినెస్ మేన్ కి ప్రజాప్రతినిధికి తేడా తెలియని నాయకులు ఉన్నంతకాలం ఇలాంటి సంఘటనలు తప్పవు మరి!! గల్లా జయదేవ్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ… సక్సెస్ ఫుల్ ప్రజాప్రతినిధి అవ్వాలంటే మాత్రం ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news