రానా వెబ్ సిరీస్ కు స్పందిస్తూ ప్రేక్షకులకు పలు ట్వీట్లు….

-

క్రైమ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెటిఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది బాబాయ్ వెంకటేశ్.. అబ్బాయ్ రానా కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ కి ఎంత మంచి టాక్ వస్తోందో.. అంతే నెగటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తోంది. అశ్లీలత ఎక్కువగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో వచ్చే కామెంట్లపై రానా దగ్గుబాటి స్పందిస్తున్నారు. రానా నాయుడు సిరీస్ ను విమర్శిస్తున్న, అసహ్యించుకుంటున్న వారికి క్షమాపణలు చెబుతున్నారు. ఇదే సమయంలో తమ సిరీస్ కు ఇంతటి ఆదరణ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఈ రోజు ఉదయం నుంచి ఆయన పలు ట్వీట్లు చేశారు. నిజానికి స్ట్రీమింగ్ కు ముందే ఈ సిరీస్ ఎలా ఉండబోతోంతో హింట్ ఇచ్చారు వెంకటేశ్. ప్రీమియర్ షో సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘‘మీ ఇంట్లో ల్యాప్‌ ట్యాప్ లు, ఫోన్లలో దీన్ని చూస్తుంటే మీ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్లు పూర్తిగా మారిపోతుంటాయి. ఎందుకంటే ఇందులో కామెడీ, హింస, సెక్స్ కూడా ఉన్నాయి’’ అని చెప్పారు. ‘కానీ మరీ ఇంతనా?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మితిమీరిన అసభ్య పదజాలం, శ‌ృంగార సన్నివేశాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ‘రానా నాయుడు’. క్రైమ్, ఈ వెబ్ సిరీస్ ను కుటుంబంతో కలిసి చూడొద్దని ఆయన కోరారు. ‘ఏ’ రేటెడ్ సినిమా అని, 18 వయసు వారికేనని పేర్కొన్నారు. ఒంటరిగానే చూడాలని ఆయన కోరడం గమనార్హం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version