Ranbir Alia News: ఒక్కటవ్వనున్న బాలీవుడ్ మోస్ట్‌ బ్యూటీపుల్ లవ్ బర్డ్స్.. డెస్టినేషన్ మ్యారేజ్ ఎక్క‌డంటే?

-

Ranbir Alia News: బాలీవుడ్ లో ల‌వ్ స్టోరీల‌కు కొద‌వ లేదు. అందులో మోస్ట్ బ్యూటీపుల్ ల‌వ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్. గ‌త నాలుగేండ్లుగా వారిద్ద‌రూ రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ జంట ఎప్పుడేప్పుడు ఒక్క‌ట‌వుతుందా అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా వీరి పెళ్లి అంశం మరోసారి బి-టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ డిసెంబర్‌లో అలియా-రణ్‌బీర్‌లు పెళ్లి ఖాయమని, రాజస్థాన్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పెళ్లికి సన్నాహాలు మొదలుపెట్టారు. వీరి పెళ్లి తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇక వీరిద్దరూ జంటగా నటించిన “బ్రహ్మాస్త్ర” షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరపుకుంటోంది. ఆలోపు ‘బ్రహ్మాస్త్ర’ మూవీ పనులతో పాటు మిగతా ప్రాజెక్ట్స్‌ను కూడా పూర్తి చేసే బిజీగా ఉన్నారట రణ్‌బీర్‌-అలియా.

ఈ సినిమాల తర్వాత ఇద్దరు నటీనటులు తమ డేట్ లను ఖాళీగా ఉంచార‌ట‌. ఎలాంటి ప్రాజెక్టుల మీద సైన్ చేయలేదట‌. దీంతో వీరి పెళ్లి పై ఊహాగానాలకు మొద‌ల‌య్యాయి. అయితే పెళ్లి తేదీపై మాత్రం క్లారిటీ లేదు. గతంలో నటి లారా దత్త సైతం వీరి పెళ్లిపై స్పందిస్తూ 2021 డిసెంబర్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుందని, 2020లోనే జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version