కెనడాలో భారతీయ మూలాలున్న మహిళ కు అరుదైన గౌరవం లభించింది. ఏకంగా కెనడా రక్షణ మంత్రి పదవి లభించింది. కెనడా రక్షణ మంత్రిగా 54 ఏళ్ల అనితా ఆనంద్ నియమించబడ్డారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో రక్షణ మంత్రిగా అనితా ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో రక్షణమంత్రిగా ఉన్న హర్జీత్ సజ్జన్ స్థానంలో అనితా ఆనంద్ నియమించబడ్డారు. జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి గత సెప్టెంబర్ లో తిరిగి అధికారంలోకి వచ్చారు.
కెనడా రక్షణ మంత్రిగా భారతీయ మూలాలున్న మహిళ అనితా ఆనంద్
-