‘బ్రహ్మస్త్ర’ సక్సెస్ తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మరోసారి తెరను పంచుకోనున్నారంటూ బీటౌన్లో తెగ వార్తలు వస్తున్నాయి. మరో రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించనున్నారని కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై రణ్‌బీర్ క్లారిటీ ఇచ్చారు.
బ్రహ్మస్త్ర’ సినిమా సక్సెస్ తర్వాత బాలీవుడ్ స్టార్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మరోసారి తెరను పంచుకోనున్నారా? ఇద్దరు కలిసి మరో రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించనున్నారా? అన్న ప్రశ్నలకు బీటౌన్లో అవుననే సమాధానం వస్తోంది. అయితే ఈ ఊహాగానాలపై ఈ ప్రేమ జంట క్లారిటీ ఇచ్చింది.
ఈ రూమర్లపై రణ్‌బీర్ కపూర్ స్పందిస్తూ ‘మా ఇద్దరి నిజ జీవితంలో సరదాగా ఉన్నాం. ప్రస్తుతానికి మేమిద్దరం మరే చిత్రంలోనూ నటించడం లేదు’ అని అన్నారు. అయితే ఆలియాభట్ మాట్లాడుతూ ‘నేను రూమర్ల గురించి విన్నాను. కానీ మా తరువాత చిత్రం బ్రహ్మస్త్ర పార్ట్ -2 మాత్రమే’ అని తేల్చేసింది. బ్రహ్మస్త్ర కాకుండా అయాన్ ముఖర్జీ ఇతర సినిమాల్లో నటించడానికి అనుమతి ఇస్తారో లేదో తెలియదని (నవ్వుతూ) చెప్పింది.
కాగా, ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, హీరోయిన్ మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించారని సమాచారం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టింది.