ఆ హీరోని అనుకునే ఏ మాయ చేసావే స్క్రిప్ట్ రాశా: గౌతమ్ మేనన్‌

-

గౌతమ్‌ మేనన్‌  తెరకెక్కించిన ‘ఏమాయ చేసావే’తో వెండితెరపై మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు నాగచైతన్య  – సమంత. ఈ సినిమాతో పరిచయమైన వీరిద్దరూ ప్రేమ, పెళ్లి అనంతరం ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకోవడంపై తాజాగా దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ స్పందించారు.

ఒకే రంగానికి చెందిన వాళ్లు పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అని గౌతమ్‌ని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘ఆ అంశంపై మాట్లాడే అధికారం నాకు లేదు. ఇద్దరు వ్యక్తులు కలుసుకోవడానికి, లేదా విడిపోవడానికి రూల్స్‌ అంటూ ఏమీ లేవు. ఏదైనా రిలేషన్‌లో ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. ఒకే రంగానికి చెందిన వాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండాలని, ఉండకూడదని ఏమీ లేదు. ఎందుకంటే, రెండు మనసులు కలిస్తే చాలు’’ అని గౌతమ్‌ చెప్పుకొచ్చారు

‘‘ఏమాయ చేసావే’ స్క్రిప్ట్‌ రాసినప్పుడు హీరోగా మహేశ్‌ బాబును అనుకున్నా. అప్పటికే ఆయన ‘పోకిరి’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు. కథ సిద్ధం చేశాక మహేశ్‌ని కలిశా. ఆసమయంలో క్లాస్‌ కాకుండా మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అలా ఆ ప్రాజెక్ట్‌ శింబు, నాగచైతన్యను వరించింది. ఇక, ‘ఘర్షణ’ని మొదట తమిళంలో చేశా. ఈ సినిమా చూసిన వెంకటేశ్‌ ఓసారి నాకు ఫోన్‌ చేసి.. ఈ సినిమా బాగా నచ్చిందని, ఇదే చిత్రాన్ని తాను తెలుగులో చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

అలా వెంకటేశ్‌తో ‘ఘర్షణ’ రూపొందించా. ఈ సినిమా కోసం వెంకీ ఎంతో కష్టపడ్డారు. ఇటీవల మేమిద్దరం రానా ఆఫీస్‌లో కలిశాం. ‘ఘర్షణ-2’ కోసం ప్లాన్‌ చేస్తున్నాం’’ అని గౌతమ్‌ వివరించారు. ఇక, శింబు హీరోగా గౌతమ్‌ దర్శకత్వం వహించిన ‘లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో గౌతమ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పై విషయాలు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news