రంగారెడ్డిలో శ్రుతి మించుతున్న ఛైర్మన్ కౌన్సిలర్ల కుమ్ములాటలు…!

-

హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, కౌన్సిలర్ల మధ్య కుమ్ములాటలు మరింత ముదిరాయి. పదే పదే ఒకరి పై ఒకరు ఎందుకు ఫిర్యాదు చేసుకుంటున్నారు.కొత్త మున్సిపాలిటీల్లో పరిపాలన పగ్గాలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే గిల్లికజ్జాలు మొదలయ్యాయ్‌. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో గొడవలు శృతి మించుతున్నాయ్‌.ఆదిభట్ల, తుక్కుగుడా, ఇబ్రహీంపట్నం, నార్సింగి, తుర్కయాంజల్ మున్సిపాలిటీల్లో చైర్మన్లు వర్సెస్ కౌన్సిలర్లు, కౌన్సిలర్లు వర్సెస్ అధికారులు అన్నట్లుగా పరిస్థితి ఉంది.

ఆదిభట్ల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ఇతర కౌన్సిలర్లపై పెత్తనం చేలాయిస్తున్నాడని ఆరోపణలు వినిస్తున్నాయ్‌. దీంతో పాటు మున్సిపల్ పరిధిలోని ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల నుండి డబ్బులు వసూలు, కొత్తగా ఇల్లు నిర్మాణం చేపట్టే వారి నుండి డబ్బులు వసూలు చేయకపోతే బిల్ కలెక్టర్ లను సస్పెండ్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.ఇక తుక్కుగూడ చైర్మన్ మధుమోహన్ కు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ ను దుర్భాషలాడటంతో పాటు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో నిధుల దుర్వినియోగం జరిగిందని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు కౌన్సిలర్లు.

Read more RELATED
Recommended to you

Latest news