తెలంగాణలో పెట్టుబడుల పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన…!

-

రాష్ర్టంలో  పెట్టుబ‌డుల‌పై ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసేస్ తెలంగాణ రాష్ట్రంలో 20 వేల 761 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో డేటా కేంద్రాల‌ను అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ ఏర్పాటు చేయ‌నుంది. హైద‌రాబాద్‌లో 2022లో అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించే అవ‌కాశం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ దీని ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు చేయ‌నుంది. . అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను తన దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news