కేటీఆర్‌ అడ్డాలో రాణిరుద్రమ..బీజేపీకి బలం పెరుగుతుందా?

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇది మంత్రి కేటీఆర్ అడ్డా..2009 నుంచి వరుస పెట్టి ఇక్కడ సత్తా చాటుతూ వస్తున్నారు. 2009లో తొలిసారి కేటీఆర్ బరిలో దిగి..చాలా స్వల్ప మెజారిటీ తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత 2010 ఉపఎన్నికలో మంచి మెజారిటీతో గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన కేటీఆర్..2018లో దాదాపు 8 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు.

ఇక్కడ ప్రతిపక్షాల అడ్రెస్ గల్లంతు అయిందనే చెప్పవచ్చు. అయితే ఇలా కేటీఆర్ కంచుకోటగా ఉన్న సిరిసిల్లపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ స్థానంలో బలపడాలని చూస్తుంది. వాస్తవానికి గతంలో ఇక్కడ కాంగ్రెస్ బలంగానే ఉండేది. కానీ నిదానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పరిస్తితి గదరగోళంలో ఉంది. సరైన నాయకుడు లేక పార్టీ కష్టాల్లో ఉంది. ఇక కాంగ్రెస్ బలహీన పడుతుండటంతో…ఆ అవకాశాన్ని బలపడాలని బీజేపీ చూస్తుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ వీక్ అవుతుంటే బీజేపీ ఎలా బలపడుతుందో..అదే తరహాలో సిరిసిల్లలో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఇదే క్రమంలో సిరిసిల్ల పాలక్‌గా రాణి రుద్రమని నియమించారు. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రాణి రుద్రమ..ఆ మధ్య బీజేపీలోకి వచ్చి దూకుడుగా పనిచేస్తున్నారు. దీంతో సిరిసిల్లలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతలు ఆమెకు అప్పగించారు.

ఇక సిరిసిల్లలో ఎంట్రీ ఇచ్చిన రుద్రమ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకొచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు..ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ కింది స్థాయిలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌ని బీజేపీ వైపుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నిదానంగా పార్టీ బలాన్ని పెంచడానికి చూస్తున్నారు. అయితే ఎంత ట్రై చేసిన బీజేపీ బలం పెరుగుతుందేమో గాని..సిరిసిల్లలో కేటీఆర్‌కు చెక్ పెట్టడం అనేది కాస్త కష్టమైన పని.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version