GET READY : ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు “వారసుడు” సాంగ్

-

విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలోని ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ.100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే.. తాజాగా ఈ సినిమా బిగ్‌ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ఇవాళ రిలీజ్‌ కానుంది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఫుల్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news