జనసేన పార్టీకి రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తన కుమారుడిని వైసీపీలో చేర్పించారు. రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ నిన్న వైసీపీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి వెంకట్ రామ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పాల్గొన్నారు.
సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేగా ఉండి, తాను వైసీపీలో చేరకుండా వ్యూహాత్మకంగా కుమారుడిని జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పించారు. గతంలో కూడా టీడీపీ నుండి వచ్చి జగన్ కు జై కొట్టిన నేతల బాటలోనే ఈయన కూడా తెలివిగా పార్టీలో చేర్చారు. ఎన్నికల ముందు అయన పార్టీ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక జనసేన నుండి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొద్దిరోజులకే జగన్ కు జై కొట్టారు. అప్పటి నుండి ఆయన తీరు వివాదాస్పదంగానే మారింది.