స్నేహితుడి భార్యపై అత్యాచారం.. వీడియోలు తీసిన ప్రబుద్దుడు.

-

స్నేహితుడని నమ్మినందుకు పచ్చని సంసారం లో చిచ్చు పెట్టాడో దుర్మార్గుడు. స్నేహితుడి భార్యను లోబరుచుకుని పలు మార్ల అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు తీసి బెదిరించాడు. చివరకు వేధింపుల భరించలేక పోలీసుల్ని ఆశ్రయించింది బాధితురాలు. ఈ ఘటన హైదరాబాద్ లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుంది. గాజుల రామారం నెహ్రు కాలనీలో నివాసం ఉండే ప్రశాంత్ భాగ్యలక్ష్మీ కాలనీలో ఉండే స్నేహితుడి భార్యపై కన్నేశాడు. భర్తకు తెలియకుండా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు… నువ్వు లేకుంటే చచ్చిపోతానని.. నిన్నూ చంపేస్తానని స్నేహితుడి భార్యను తరుచూ వేధించేవాడు.

అత్యాచారం

ఇదిలా ఉంటే… ప్రశాంత్ స్నేహితుడి భార్యపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో పాటు ఈ ఘటనలకు సంబంధించిన  వీడియోలను కూడా రికార్డ్ చేశాడు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమె భర్తను, పిల్లల్ని చంపేస్తానని బెదిరించసాగాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానంటూ.. ఇప్పటి వరకు బాధితురాలు నుంచి రూ. 16 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాడు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version